cylinder Blast In Train | రైలులో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి..!
పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta) వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Jaffer Express train)లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
cylinder Blast In Train | పాకిస్థాన్ (Pakistan)లోని క్వెట్టా (Quetta) వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Jaffer Express train)లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..
పెషావర్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. చిచావత్ని రైల్వే స్టేషన్ వద్దకు రాగానే నాలుగో నంబర్ బోగీలో సిలిండ్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్‌ను ఓ ప్రయాణికుడు రైలు వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లినట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. రైలు, ట్రాక్ మొత్తాన్ని పరిశీలించి.. పేలుడు జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

