Video: ఉక్రెయిన్ రద్దీ మాల్‌పై రష్యా క్షిపణి దాడి… ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
కీవ్: రద్దీగా ఉన్న ఉక్రెయిన్ షాపింగ్ మాల్‌పై క్షిపణితో రష్యా దాడి చేసింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా 20 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రెమెన్‌చుక్‌లో సోమవారం ఈ సంఘటన జరిగింది. క్షిపణి దాడి వల్ల షాపింగ్ మాల్లో భారీగా మంటలు ఎగసిపడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఆ సమయంలో షాపింగ్ మాల్లో వెయ్యి మందికిపైగా ఉన్నట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించినట్లు పేర్కొంది. ఈ సంఘటనలో ఎంత మంది గాయపడ్డారో లెక్కించడం కష్టమని ఆయన అన్నట్లుగా ఆ వార్తా సంస్థ తెలిపింది.
కాగా, రద్దీ షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యా నుంచి మర్యాద, మానవత్వం ఆశించడం పనికిరాని చర్య అని టెలిగ్రామ్‌లో విమర్శించారు. అయితే ఈ దాడిలో ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు అన్నది చెప్పలేమని ఆ నగర మేయర్ విటాలి మెలెట్స్కీ తెలిపారు. ఉక్రేనియన్ ఎంపీ రోమన్ హ్రిష్చుక్ ఈ దాడికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం మంటలు, నల్లటి పొగలు కమ్ముకోగా ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది.
Kremenchuk.
Missile strike by Russian missiles on the shopping center.
Zelensky: It is impossible to imagine the number of victims.If this is not a terrorist attack, then what!? If Russia is not a terrorist country, then who are they? pic.twitter.com/jWhQdtSkSB
— Roman Hryshchuk (@grishchukroma) June 27, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

