Hantavirus: హంటా వైరస్ సోకిన క్రూయిజ్లో ఇద్దరు భారతీయులు
Hantavirus: విలాసవంతమైన డచ్ క్రూయిజ్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు హంటా వైరస్తో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ డచ్ వెసల్ ఎంవీ హొండియస్ సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ నౌకలో మరో అయిదురు వ్యక్తులకు హంటావైరస్ సోకినట్లు తెలిసింది.
లండన్: అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూయిజ్లో ముగ్గురు వ్యక్తులు హంటా వైరస్(Hantavirus)తో మరణించిన విషయం తెలిసిందే. అయితే డచ్ వెసల్ ఎంవీ హొండియస్ క్రూయిజ్ సిబ్బందిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ నౌకలో మరో అయిదురు వ్యక్తులకు హంటావైరస్ సోకినట్లు తెలిసింది. ఓసియన్వైడ్ ఎక్స్పడీషన్ ఆ నౌకను ఆపరేట్ చేస్తున్నది. ఏప్రిల్ ఒకటో తేదీన అర్జెంటీనాలోని హుషుహియా నుంచి ఆ నౌక బయలుదేరింది. స్పెయిన్లోని కెనార ఐలాండ్లో మే 10వ తేదీ వరకు చేరుకోవాల్సి ఉంది. ఆ లగ్జజీ నౌకలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. 28 దేశాలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిసింది. కానీ హంటావైరస్ సోకడం వల్ల ఏప్రిల్ 24వ తేదీన ఆ నౌకను సెయింట్ హెలినా దీవిలో నిలిపివేశారు.
క్రూయిజ్లో హంటా వైరస్ సోకిన అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. అనుమానిత 8 కేసుల్లో అయిదుగురికి వైరస్ కన్ఫర్మ్ అయినట్లు పేర్కొన్నది. కోవిడ్ లాంటి పరిస్థితులు ఇప్పుడు ఏమీ లేవని డబ్ల్యూహెచ్వో ఎపిడమాలజిస్ట్ మారియా వాన్ కేర్కోవ్ తెలిపారు. ఇది కోవిడ్ కాదు, ఇన్ఫ్లూయాంజా కాదు, ఇది చాలా భిన్నంగా వ్యాప్తి చెందుతుందని వాన్ కేర్కోవ్ చెప్పారు.క్రూయిజ్లో ఉన్న ప్రతి ఒక్కర్నీ మాస్క్ ధరించాలని చెప్పినట్లు వెల్లడించారు. సాధారణంగా ఎలుకల వల్ల హంటా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కానీ మనుషుల ద్వారా ఆ వ్యాధి వ్యాప్తి అవుతున్నట్లు తొలిసారి నిర్ధారణ అయినట్లు డబ్ల్యూహెచ్వో అభిప్రాయపడుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

