అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరు దుర్మరణం
Memphis | అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలో మెంఫిస్‌లో (Memphis) 19 ఏండ్ల యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎజెకిల్ కెల్లీ అనే 19
టెన్నెస్సీ: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెన్నెస్సీ రాష్ట్రంలో మెంఫిస్‌లో (Memphis) 19 ఏండ్ల యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎజెకిల్ కెల్లీ అనే 19 ఏండ్ల యువకుడు మెంఫిస్ పట్టణలో తిరుగుతూ జనాలపై కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం తన వాహనాన్ని అక్కడే వదిలి కారును హైజాక్ చేశాడని తెలిపారు. అతనికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.
The suspect is a 19-year-old male Black driving a light blue Infiniti. pic.twitter.com/PkblUXJu8v
— Memphis Police Dept (@MEM_PoliceDept) September 8, 2022
సమస్య పరిష్కారమయ్యేవరకు పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు రావద్దని సూచించారు. కాల్పుల ఘటనను ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేశాడని అధికారులు వెల్లడించారు. ఇక మెంఫిస్ యూనివర్సిటీ తన విద్యార్థులకు హెచ్చరిక జారీచేసింది. వర్సిటీకి నాలుగు మైళ్ల దూరంలో కాల్పులు జరిగాయని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

