న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్బారోలో ఉన్న 19 అంతస్థుల బ్రాంక్స్ ట్విన్పార్క్ అపార్ట్మెంటులో మంటలు చెలరేగాయి. దీంతో 19 మంది సజీవ దహనమయ్యారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంలో 60 మందికిపైగా గాయపడ్డారని న్యూయార్క్ మేయర్ సలహాదారు స్టిఫన్ రింగెల్ తెలిపారు. వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రుల్లో చాలామంది పొగ పీల్చడం వల్ల ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
సహాయక చర్యల్లో సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది చర్యల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్లోని రెండు, మూడో అంతస్థులో ప్రమాదం జరిగిందన్నారు. మంటలు వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించాయని చెప్పారు.
అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 1990లో న్యూయార్క్‌లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. అప్పుడు 87 మంది మరణించారని వెల్లడించారు.