కైరో: వలసదారులతో ప్రయాణిస్తున్న నాలుగు పడవలు యెమెన్, జిబౌతి జలాల్లో మునిగిపోయాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు మరణించగా, 186 మంది గల్లంతయ్యారు. ఇందులో రెండు పడవలు యెమెన్ జలాల్లో గురువారం తిరగబడ్డాయని వలసదారుల అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి తమిమ్ తెలిపారు.
ఇద్దరిని రక్షించామని, కానీ 181 మంది వలసదారులు, ఐదుగురు సిబ్బంది గల్లంతయ్యారన్నారు.