జకార్తా: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకర్ వాహనం ఢీకొన్నాయి. మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. (16 Killed In Indonesia) ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉత్తర మూసి రావాస్ రీజెన్సీలో ప్రయాణికుల బస్సు, డీజిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.
కాగా, బస్సులో ప్రయాణిస్తున్నవారిలో 14 మంది ప్రయాణికులు, ఆయిల్ ట్యాంకర్లోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బస్సులోని మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు టైర్ పేలడంతో డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోయినట్లు చెప్పారు. డీజిల్ ట్యాంకర్ను ఆ బస్సు ఢీకొట్టడంతో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు వివరించారు.
16 people killed in a horrific crash in Indonesia’s Sumatra, after passenger bus collided with fuel tanker — Xinhua
The devastating accident also left four others injured pic.twitter.com/DjTirfQpjn
— RT (@RT_com) May 6, 2026