Boat Capsizes | అబుజ, జూలై 25: యూరప్‌కు వెళుతున్న ఆఫ్రికన్ వలసదారుల పడవ బోల్తా పడటంతో 15 మంది మృతి చెందారు. 150 మంది గల్లంతయ్యారు. సోమవారం మారిటానియా రాజధాని నౌవక్చోట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పడవలో మొత్తం 300 మంది ప్రయాణిస్తున్నారని అంతర్జాయ వలస సమాఖ్య తెలిపింది. మౌరిటానియా తీర రక్షక దళం 120 మందిని రక్షించింది. గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగుతున్నది. అభద్రత, పేదరికం కారణంగా ఆఫ్రికన్ వలసదారులు యూరప్ వలస వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.