లండన్: రోజుకు రెండు నిమిషాల పాటు, మొత్తంగా వారానికి 15 నిమిషాల పాటు కఠిన వ్యాయామం చేస్తే మరణం ముప్పును ఆలస్యం చేయొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత జీవనవిధానంలో శారీరక శ్రమకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారని, అలాంటి వారు రోజుకు 2 నిమిషాల పాటు కష్టపడితే చాలని వెల్లడించారు. హృద్రోగ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ శాస్త్రవేత్తలు వివరించారు.