న్యూఢిల్లీ: భారతదేశం కాలుష్య కాసారంగా మారుతున్నదని స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAir నివేదిక స్పష్టం చేస్తున్నది. 2022 ఏడాదికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాలు, నగరాల జాబితాలు IQAir తాజా నివేదికలో ఉన్నాయి. ప్రపంచంలోని ఉన్న టాప్-20 కాలుష్య నగరాల్లో 15 నగరాలు భారత్‌కు చెందినవే ఉండటం గమనార్హం.
1. లాహోర్ (పాకిస్థాన్), 2. హోటన్ (చైనా), 3. భివాండి (భారత్), 4. ఢిల్లీ (భారత్), 5. పెషావర్ (పాకిస్థాన్), 6. దర్భంగా (భారత్), 7. అసోపూర్ (భారత్), 8. ఎన్డ్జమేనా (చాద్), 9. న్యూఢిల్లీ (భారత్), 10. పట్నా (భారత్), 11. ఘజియాబాద్ (భారత్), 12. ధారుహెరా (భారత్), 13. బాగ్దాద్ (ఇరాక్), 14. చాప్రా (భారత్), 15. ముజఫర్‌నగర్ (భారత్), 16. ఫైసలాబాద్ (భారత్), 17. గ్రేటర్ నోయిడా (భారత్), 18. బహదూర్గఢ్ (భారత్), 19. ఫరీదాబాద్ (భారత్), 20. ముజఫర్‌పూర్ (భారత్) ప్రపంచంలోని టాప్-20 కాలుష్య నగరాలుగా ఉన్నాయి.
అదేవిధంగా IQAir తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉన్నది. 1. చాద్, 2. ఇరాక్, 3. పాకిస్థాన్, 4. బహ్రెయిన్, 5. బంగ్లాదేశ్ ప్రపంచంలోని టాప్-5 కాలుష్య దేశాలుగా ఉన్నాయి.