AI Chatbot | న్యూఢిల్లీ: ఏఐ చాట్‌బాట్‌తో ప్రేమలో పడిన 14 ఏళ్ల పిల్లాడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి తల్లి కోర్టుకెక్కింది. చాట్‌బాట్ ‘డేనెరిస్ టార్గారియన్’తో సంభాషణ తర్వాత తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన ఆమె ఆ క్యారెక్టర్ సృష్టికర్త అయిన కంపెనీతోపాటు గూగుల్‌పైనా దావా వేశారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లోని క్యారెక్టర్ అయిన టార్గారియన్ పేరుతో సృష్టించిన ఈ చాట్‌బాట్‌కు పిల్లాడు సెవెల్ సెట్జెర్ బానిసయ్యాడు.
దానితో మాట్లాడిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెంపుడు తండ్రి హ్యాండ్‌గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి ఆత్మహత్యకు చాట్‌బాటే కారణమని..దాని సృష్టికర్త కంపెనీతోపాటు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో అతడి తల్లి దావా వేశారు. చాట్‌బాట్ తన కుమారుడిని మానవరూప, హైపర్ సెక్యువలైజ్డ్, భయపెట్టే వాస్తవిక అనుభవాలతో లక్ష్యంగా చేసుకుందని మేగాన్ తన దావాలో ఆరోపించారు. ఈ కేసుపై గూగుల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ క్యారెక్టర్ ఏఐ ఉత్పత్తుల అభివృద్ధిలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.