Hanif Abbasi | సింధూ జలాలు ఆపితే యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. భారత్‌పై దాడికి 130 అణు బాంబులు రెడీ: పాక్ మంత్రి ప్రేలాపన
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ విధించిన ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ మంత్రి భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగానే హెచ్చరించారు.
- గగనతలం మూసివేత కొనసాగిస్తే మీ వైమానిక సంస్థల దివాలా ఖాయం
- పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రేలాపన
Hanif Abbasi | ఇస్లామాబాద్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ విధించిన ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ మంత్రి భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆ దేశ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగానే హెచ్చరించారు. పాకిస్థాన్ ఆయుధగారంలో ఘోరి, షాహిన్, ఘజ్నవి క్షిపణులు సహా 130 అణు వార్హెడ్లు కేవలం భారత్ కోసమే సిద్ధంగా ఉంచినట్టు ఆయన చెప్పారు.
భారత్ సింధూ జలాల సరఫరాను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలని అన్నారు. పాకిస్థాన్‌లోని అణు ఆయుధాలు ఉన్నవి కేవలం ప్రదర్శించడానికి కాదని, తమ దేశంలోని వివిధ రహస్య ప్రదేశాల్లో వాటిని ఉంచామని, ఏమాత్రం రెచ్చగొట్టినా దాడిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రకటించిన ఆంక్షలు, ఇతర నిర్ణయాలకు తీవ్ర పరిణామాలు తప్పవని తెలిపారు. తమ గగనతలం మూసివేత కొనసాగిస్తే మీ వైమానిక సంస్థలు దివాళా తీయడం ఖాయమని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

