మెక్సికో సిటీ: మెక్సికోలోని (Mexico) గువానాజువాటోలో దారుణం చోటుచేసుకుంది. మతపరమైన సంబురాల్లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు (Mass Shooting) తెగడబ్డాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 20 తీవ్రంగా గాయపడ్డారు. గువానాజువాటో (Guanajuato) రాష్ట్రంలోని ఇరాపువాటోలో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్కు గౌరవంగా వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. మ్యూజిక్ వింటూ, మద్యం సేవిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇంతలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. దీంతో ఒక్కసారిగా బయపడి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాల్పుల్లో 12 మంది ఘటనా స్థలంలోనే మరణించారని అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారని చెప్పారు. దాడి వెనుక ఉద్దేశం, కాల్పులకు తెగబడిన ఆగంతకుడి జాడ తెలియరావాల్సి ఉందన్నారు. ఈ దాడిని మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘ఇది చాలా దురదృష్టకరం. దర్యాప్తు జరుగుతున్నదని’ వెల్లడించారు.
కాగా, మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గువానాజువాటో ఒకటి. ఇక్కడ తరచూ క్రిమినల్ గ్రూపుల మధ్య తగాదాలు జరుగుతూనే ఉంటాయి. గత నెలలో శాన్ బార్టోలో డి బెర్రియోస్లోని ఓ క్యాథిలిక్ చర్చి కార్యక్రమంలో ఏడుగురు హత్య గురయ్యారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో 1,435 మంది హత్యకు గురయ్యారు. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండింతల సంఖ్య కావడం గమనార్హం.
#Nacionales | 🚨❗ Lamentable… M@asacre en fiesta en Irapuato deja 10 personas sin vida, entre ellos un menor.
Al menos 10 personas fueron asesinadas durante un ataque armado en la fiesta patronal de San Juan, en #Irapuato, #Guanajuato, informaron autoridades.
Detalles:… pic.twitter.com/yQbGKMRKhE
— Plano Informativo Aguascalientes (@planoags) June 25, 2025