Shooting | కెనడా (Canada)లో కాల్పుల (Shooting) ఘటన కలకలం సృష్టించింది. టొరంటో నగరంలోని ఓ పబ్ (Toronto pub)లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మందికిపైగా గాయపడ్డారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10:39 గంటల సమయంలో నగరంలోని స్కార్బరో టౌన్ సెంటర్ సమీపంలోని పబ్లో కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు పబ్లో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న టొరంటో నగర పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాల్పుల ఘటనపై టొరంటో మేయర్ ఒలివియా చౌ విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని తొందర్లోనే పట్టుకోనున్నట్లు వెల్లడించారు.
Also Read..
Kamala Harris | కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్..?
Musk Vs Rubio | కేబినెట్ మీటింగ్.. ట్రంప్ ముందే వాగ్వాదానికి దిగిన మస్క్, రుబియో..!
Justin Trudea | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు.. కెనడా ప్రధాని కంటతడి