రోమ్, జూన్ 9: సెంచరీలు కొట్టే వయస్సు మాది.. బౌండరీలు దాటే మనస్సు మాది.. నిజమే ఈ బామ్మ చేసిన పనికి.. ఆమెలాంటి వారిని చూస్తే ఈ పాట రాశారేమో అనిపించక మానదు. ఇటలీకి చెందిన ఈమె పేరు కాండిడా ఉడర్జో. ఆమె వయస్సు వందేండ్లు.
అయినా కూడా ఇంకా 25 ఏండ్ల యువతిలాగా దూసుకుపోతున్నది. ఈ వయసులో డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకున్నది. స్వయంగా కారు నడిపి డ్రైవింగ్ టెస్టులో పాసైంది. కంటి పరీక్షలు కూడా చేసిన అధికారులు లైసెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు.