US-Israel Iran War | నెల రోజులుగా సాగుతున్న ఇరాన్ యుద్ధం.. ఇప్పటివరకు మరణించిన కీలక నేతలు వీళ్లే
US-Israel Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమై నెల రోజులవుతోంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది ఇరాన్. ఆ దేశ అగ్రనేతలు దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు.
US-Israel Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమై నెల రోజులవుతోంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది ఇరాన్. ఆ దేశ అగ్రనేతలు దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కూడా మరణించారు. మరోవైపు కొందరు అమెరికా దళాలు, ఇజ్రాయెల్ దళాలు, పౌరులు, గల్ఫ్ దేశాల్లోని కొందరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ, రెండు పక్షాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ యుద్ధంలో మరణించిన కీలక నేతల వివరాలివి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజిర్జాదె, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్ రహీమ్ మౌసావి, ఐఆర్జీసీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్, బేసిజ్ కమాండర్ గోలాంరెజా సోలేమని, నావల్ కమాండర్ అలీ రెజా టాంగ్సిరి, మిలిటరీ బ్యూరో హెడ్ మొహమ్మద్ షిరాజి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ సుప్రీం లీడర్స్ ఆఫీస్ అక్బర్ ఎబ్రహింజాదె, ఇంటెలిజెన్స్ హెడ్ గోలాంరెజా రెజేయాన్, హెడ్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ఆపరేషన్స్ బహ్రం హోసేని మోట్లాగ్, హెడ్ ఆఫ్ లాజిస్టిక్స్ హస్సనాలి తాజిక్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సలేహ్ అసాదితోపాటు ఇంకొందరు అగ్రనాయకులు, వారి సన్నిహితులు కూడా మరణించారు. అలాగే అయతొల్లా ఖమేని కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇక నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబా ఖమేని గురించిన ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధంలో కీలక నేతలతోపాటు 3,329 మంది మరణించినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల అంచనా. ఇందులో 1,492 మంది సాధారణ పౌరులున్నారు. వీరిలో 221 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇరాన్‌లోని ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 168 మంది మరణించారు. వీరిలో 110 మంది పిల్లలు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

