ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) రుణ షరతులకు తలొగ్గడంతో ప్రజలపై భారీగా పన్నుల భారం పడింది. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం పెట్రోల్ లీటర్కు రూ.22.20 పెరిగి రూ.272కి చేరింది. హైస్పీడ్ డీజిల్ రూ.17.20 పెరిగి రూ.280కి, కిరోసిన్ రూ.12.90 పెరిగి రూ.202.73కి చేరాయి. లైట్ డీజిల్ ఆయిల్ రూ.9.68 పెరిగి రూ.196.68కి చేరుకున్నది.