వాషింగ్టన్: హైస్కూల్లో చదువుతున్న ఒక అమెరికా విద్యార్థి ప్రపంచ సైన్స్ వర్గాన్ని ఆశ్చర్యపరుస్తూ 15 లక్షల కాస్మిక్(విశ్వ సం బంధిత) ఆబ్జెక్ట్స్‌ను కృత్రిమ మేధ (ఏఐ) యంతో కనుగొన్నాడు. కాలిఫోర్నియాకు చెందిన మట్టెయో పాజ్ పనితీరుపై అచ్చెరువొందిన నాసా సంచాలకుడు జేర్డ్ ఐసాక్‌మ్యాన్ అతడికి తమ సంస్థలో ఉద్యోగం ఇస్తానని.. జెట్ విహారాన్ని బోనస్‌గా ఇస్తానని ప్రతిపాదించాడు. కాల్టెక్స్లోని ప్లానెట్ ఫైండర్ అకాడమీలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డేవి కిర్క్‌పాట్రిక్ పర్యవేక్షణలో పాజ్ ఈ ప్రాజెక్ట్ చేపట్టాడు.