OU Registrar | హిమాయత్ నగర్, ఏప్రిల్ 29: దేశ ఆర్థిక వ్యవస్థలో యువత పాత్ర కీలకమని ఓయూ రిజిస్ట్రార్ డాక్టర్ నరేశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో మంగళవారం నాడు నేషనల్ సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో ఓయూ రిజిస్ట్రార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. పలు రకాలుగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తుందని పేర్కొన్నారు.
యువత ఆర్థిక వ్యవస్థపై అధ్యయనం చేస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఓయూ రిజిస్ట్రార్ నరేశ్ రెడ్డి అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఓబుల్ రెడ్డి, అప్పారావు, కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ శాంతి పాల్గొన్నారు.