హైదరాబాద్, మే 16 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో బాలికలను (ఇద్దరు అక్కాచెల్లెళ్లు) వేధించినందుకు ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాలు.. అవినాష్‌రెడ్డి అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తోబుట్టువుల్లో ఒకరితో పరిచయం ఏర్పరుచుకుని స్నేహం కొనసాగించాడు. ఆ తర్వాత ప్రేమను ప్రతిపాదించడంతో ఆమె కూడా అంగీకరించింది. అవినాష్ మెల్లగా ఆమె సోదరిపై కూడా ఆసక్తి ఉందని చెప్పడం ప్రారంభించాడు. ఆమె ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించడం ప్రారంభించాడు.
ఆమె తన సోదరిని అలాగే ఇంట్లోని బంగారు ఆభరణాలను తీసుకువస్తే ఫొటోలు, వీడియోలను తొలగిస్తానని చెప్పాడు. వేదింపులు ఎక్కువ అవడంతో బ్లాక్ మెయిల్ భరించలేని బాలిక ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. బాలికల తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.