కవాడిగూడ, మార్చి 15: పనికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.రాజు వివరాల ప్రకారం.. బన్సీలాల్‌పేట్‌లోని సీసీ నగర్లో మక్క ల సత్యమ్మ(రేణుక) రాములు దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు స్వప్న (20) హిమాయత్‌నగర్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పని చేస్తున్నది. ఈ నెల13న పనికి వెళ్లిన ఆమె రాత్రి తొమ్మిది గంటలైనా తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అంతటా వెతికారు. స్వప్న చింటూతో 8 నెలలుగా చాటింగ్ చేస్తున్నట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.