మద్యం మత్తులో యువతి వీరంగం
పీకలదాకా మద్యం సేవించి పక్క ఫ్లాట్‌లోని యువతితో గొడవకు దిగడంతోపాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై వీరంగం సృష్టించిన యువతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- పక్క ఫ్లాట్ యువతితో గొడవ..
- గదిలోకి వెళ్లి గ్యాస్ ఓపెన్..
- చెలరేగిన మంటలు అరెస్ట్ చేసిన పోలీసులు
బంజారాహిల్స్, జూన్ 28: పీకలదాకా మద్యం సేవించి పక్క ఫ్లాట్‌లోని యువతితో గొడవకు దిగడంతోపాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై వీరంగం సృష్టించిన యువతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న అలిస్ జోసెఫ్ (26) అనే యువతి గతంలో ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండేది. ఇటీవల వేరే ఉద్యోగం కోసం వెతుకుతోంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో పీకలదాకా మద్యం సేవించి ఫ్లాట్‌కు వచ్చిన అలిస్ జోసెఫ్.. తన పక్కింటి ఫ్లాట్ డోర్‌ను కొట్టింది.
దానిలో నివాసం ఉంటున్న బెంగాల్‌కు చెందిన నేహా థాపా అనే యువతితో గొడవకు దిగింది. సుమారు అరగంటపాటు న్యూసెన్స్‌కు పాల్పడడంతో పాటు డయల్ 100కు ఫోన్ చేసిన అలిస్ జోసఫ్.. తన పక్కింట్లో గంజాయి అమ్ముతున్నారంటూ చెప్పింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సోదా చేయగా అలాంటి అనవాళ్లు లభ్యం కాలేదు. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న అలిస్ జోసఫ్ పోలీసులపై నోరుపారేసుకోవడంతోపాటు గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుంది.
ఇంట్లోని కిచెన్‌లో గ్యాస్ స్టవ్‌ను ఆన్చేసింది. అంతటితో ఊరుకోకుండా నిప్పు వెలిగించడంతో మంటలు చెలరేగాయి. దీంతో బయటున్న పోలీసులతో పాటు ఇంటి యజమాని, స్థానికులు కలిసి తలుపులు బద్దలు కొట్టి మంటలు అర్పారు. నిందితురాలు అలిస్ జోసెఫ్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు పక్కింట్లో నివాసం ఉంటున్న నేహా థాపా ఫిర్యాదు మేరకు బాధితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

