Hyderabad | సరూర్‌నగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేయసి తండ్రిపై కాల్పులు
Hyderabad | హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో సదరు యువతి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
Hyderabad | హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో సదరు యువతి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేటకు చెందిన బల్వీందర్ సింగ్ (25), సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్డు నంబర్ 14లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఉంటున్న మాన్విత (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వాళ్ల ప్రేమ వ్యవహారం ఇష్టంలేని మాన్విత తండ్రి రేవంత్ ఆనంద్(57) ఆమెను అమెరికా పంపించేవాడు. ఈ విషయం తెలిసి బల్వీందర్ సింగ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తన ప్రేయసిని తనకు దూరం చేశారని రేవంత్ ఆనంద్‌పై బల్వీందర్ సింగ్ కక్ష పెంచుకున్నాడు. కోపంతో రగిలిపోయిన బల్వీందర్ సింగ్.. మాన్విత ఇంటికి వెళ్లి ఆమె తండ్రి రేవంత్ ఆనంద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్త ముదరడంతో తనతో తెచ్చుకున్న ఎయిర్‌గన్‌తో రేవంత్ ఆనంద్‌పై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ రేవంత్ ఆనంద్ కంటి నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ఆనంద్‌ను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

