మియాపూర్ మార్చి 14: మద్యం మత్తు లో ఇద్దరు లిఫ్ట్ గుంతలో పడి.. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది . సీఐ తెలిపిన వి వరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సురేందర్( 36 ), కిషన్( 20 )లు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఆఫీజ్పేట్, ప్రేమ్ నగర్ కాలనీలో నిర్మాణం లో ఉన్న భవనంలో మేస్తి్ర వద్ద పనిచేసున్నా రు. వీరితోపాటు రామ్ శంకర్ , మహేశ్, భరత్‌లు కూడా పనిచేస్తున్నారు.
నిర్మాణం లో ఉన్న భవనం మొదటి అంతస్తులో ఉం టూ జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి భవనం లిఫ్ట్ గుంతలో సురేందర్, కిషన్ లు పడిపోయారు. అక్కడే ఉన్న స్నేహితులు వారిని గుంతలోంచి బయటికి తీసి సురేందర్‌ను ఏరియా అస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు.
గాయాలైన కిషన్ ప్రైయివేటు అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సురేందర్, కిషన్‌లు ప్రమాదవశాత్తు కిందపడ్డారా ?స్నేహితులు మద్యం సేవించి గొడ వ పడ్డారా ?అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సురేందర్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.