అనన్య సామాన్యం
పుట్టగానే పరిమళించిన పూబోణిలా యువ నృత్య కళాకారిణి అనన్య అరంగేట్రంలోనే అదరహో అనిపించింది. రవ్రీందభారతీలో శనివారం సాయంత్రం అనన్య కూచిపూడి రంగ ప్రవేశం దీపాంజలి సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కనువిందైన నృత్యాభిషేకంలో ఎన్నెన్నో విశేషాలు.. పద్మావతి ప్రవేశ దరువు చూపించి.. ముద్దుగారే యశోదలా మురిపించి.. జయజయ దుర్గేతో ఆదిశక్తిని తలపించి అనిర్వచనీయ అనుభూతిని పంచింది.
- కూచిపూడి అరంగేట్రం
- ఆద్యంతం చప్పట్లతో మార్మోగిన ప్రాంగణం
శ్రీరామతత్వం.. శ్రీకృష్ణుడి తన్మయత్వం.. ఆదిశక్తి రౌద్రం.. రుద్రమ్మ వీరత్వం.. వెరసి అనన్య కూచిపూడి అరంగేట్రం. రవీంద్రభారతిలో శనివారం దీపాంజలి సంగీత సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యువ నృత్యకారిణి అనన్య కూచిపూడి రంగ ప్రవేశం ఆద్యంతం ఆకట్టుకున్నది. వేదిక కలియ తిరుగుతూ అనన్య చేసిన నాట్యానికి వీక్షకుల చప్పట్లు తోడవడంతో సభా ప్రాంగణం మార్మోగింది. ఎందరో అతిరథ మహారథుల రాకతో అనన్య కూచిపూడి రంగ ప్రవేశం ఒక అపూర్వ ఘట్టంగా నిలిచింది.
– సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, ఆగస్టు 12 ( నమస్తే తెలంగాణ ) : పుట్టగానే పరిమళించిన పూబోణిలా యువ నృత్య కళాకారిణి అనన్య అరంగేట్రంలోనే అదరహో అనిపించింది. రవ్రీందభారతీలో శనివారం సాయంత్రం అనన్య కూచిపూడి రంగ ప్రవేశం దీపాంజలి సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కనువిందైన నృత్యాభిషేకంలో ఎన్నెన్నో విశేషాలు.. పద్మావతి ప్రవేశ దరువు చూపించి.. ముద్దుగారే యశోదలా మురిపించి.. జయజయ దుర్గేతో ఆదిశక్తిని తలపించి అనిర్వచనీయ అనుభూతిని పంచింది. నవ యువ నృత్యానికి సభికులు మంత్ర ముగ్ధులయ్యారు. గురువు దీపికారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన అనన్య నృత్యం విశేషంగా ఆకట్టుకున్నది. స్మిత వదనంతో, ప్రసన్న అభినయంతో ఆరబీ రాగంలో ఆది తాళంలో ప్రాణవాకారం అంటూ నర్తిస్తుంటే సభంతా పరవశించిపోయింది. రౌద్రం, ఆర్తి, భక్తి, బీభత్సం కలగలిపి తాండవం చేసింది. నరసింహుడి పల్లవి రాగానే ఉగ్రతాపం చూపించగానే చప్పట్ల వర్షం కురిసింది. రుద్రాణి రూపమై అన్న పాదంలో ఒక్కసారిగా ఒళ్లు జలదరించేలా భీకర వీరత్వం చూపించారు. తెలుగు తేజమై విరాజిల్లుతూ అనే పల్లవి దగ్గర లాలిత్యంతో చిన్న చిరునవ్వుతో మంత్రముగ్ధులను చేసింది. అనంతరం నాట్యం మధ్యలో చిన్నారి అనన్య చిన్ననాటి వీడియోలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

ప్రముఖుల ప్రశంసలు..
అనన్య నాట్య ప్రదర్శనను ఆద్యంతం మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర శాఖల అధిపతులు వీక్షించారు. ఆమె నాట్యానికి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం అనన్య గురువు దీపికా రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అనన్య తల్లిదండ్రులు సౌమ్యరావు, శ్రీనివాస్‌రావు, గ్రాండ్ పేరెంట్స్ పి. వెంకటరావు, భారతి, రవీందర్రావు, శశికళ తదితరులు హాజరయ్యారు.

ఆల్‌రౌండర్ అనన్య..
ఓ వైపు సామాజిక సేవలో భాగంగా ‘స్టోరీస్ ఆన్ వీల్స్’ పేరుతో మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను అందిస్తూ జ్ఞానాన్ని పంచుతోంది. మరోవైపు ఆమెలో ఉన్న నాట్య ప్రతిభను వివిధ స్టేజీలపై ప్రదర్శిస్తూ దూసుకెళ్తున్నది. ధైర్యం, నిబద్ధత ఆసక్తిని కలిగి ఉన్న అనన్య ఆమె తల్లిదండ్రులు సౌమ్యరావు, శ్రీనివాస్ రావుల ప్రోత్సాహంతో రాణిస్తోంది. స్కూల్, కాలేజీల్లో అనేక క్లబ్‌లకు నాయకత్వం వహించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభల్లో నాట్య ప్రదర్శన చేశారు. తిరువనంతపురంలో జరిగిన నాట్యోత్సవంలోనూ ఆమె ప్రముఖుల ప్రశంసలు అందుకున్నది. కాలేజీలో వైస్ కెప్టెన్‌గా ఎన్నికైంది. మరోవైపు గిటార్లోనూ ప్రతిభ కనబరిచింది. వటంటీర్ చాంపియన్ అవార్డును అందుకుంది. ఆమె చేస్తున్న ప్రాజెక్టుకు ఐబీ గ్లోబల్ యూత్ యాక్షన్ ఫండ్ మంజూరవడం విశేషం.



Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

