Yellow Ribbon Run | ఖైరతాబాద్, మార్చి 2 : మహిళల్లో వచ్చే ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ది ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ వద్ద 3కే, 5కే, 10కే విభాగాల్లో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించారు. ఈ రన్‌ను సామాజికవేత్త, సినీనటి డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల, ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమ్మి బింద్రాతో కలిసి ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా హాజరైన సీఐడీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ షీకా గోయెల్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.