తెలుగు యూనివర్సిటీ, మే 2 : సాంకేతికతను వినియోగించడంతో పాటు కథల పరంగా పరిమితులకు లోబడి సినిమాలు తీసిన మణిరత్నం గొప్ప దర్శకులని ప్రముఖ రచయిత్రి ఓల్గా అన్నారు. మంగళవారం తెలుగుయూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మణిరత్నం సినిమాలలో స్త్రీ పాత్రలు అనే అంశంపై సమావేశమందిరంలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. స్త్రీలను అందంగా చిత్రించడంలో గొప్పగా ఉన్నప్పటికీ కథలలో తిరుగుబాటు తనంలో పరిమితులు ఉన్నాయన్నారు. సినిమా గీత రచయిత్రి పింగళి చైతన్య ప్రసంగిస్తూ పిల్లల్లో అటిజంపై ముప్పేయేండ్ల క్రితమే అంజలి సినిమా తీశారని అన్నారు. ఎవీ అరవింద్, ప్రవీణ్, కళ్యాణి, అరుణ్ జ్యోతి, నిలాంబరి, నేహా, జితేందర్, జగన్, రవి కుమార్ పాల్గొన్నారు.