దుండిగల్, మే 18: క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కార్మికుడి నిండుప్రాణం తీసింది. ఈ ఘట న దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రకు చెందిన వాగ్మూరి గుణాజీ(51), నాగ దంపతులు. బతుకుదెరువు కోసం వలస వచ్చి దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లిలో నివాసముంటున్నారు. గడిచిన 20 ఏండ్లుగా దుండిగల్ తండా-2కు చెందిన కొర్ర నగేష్ అనే ఇటుకబట్టీల యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తూన్నాడు. అయితే ఆదివారం రాత్రి గుణా జీ తన యజమాని నగేష్‌కు చెందిన ఇటుకబట్టీ వద్ద రాత్రి కాపాలాగా పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇటుకలను తరలించేందుకు వచ్చిన క్రేన్.. గుణాజీ నిద్రిస్తున్న విషయం గమనించకుండా అతని పై నుండి వాహనాన్ని పోనిచ్చాడు.
దీంతో గుణాజీ తొడకండరాలు పూర్తిగా నుజ్జునుజ్జుకావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే దుర్మరణం చెందా డు. దీంతో బాధితుడు కుటుంబానికి న్యా యం చేయాలని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఇంటి యజమాని మృతితో ఏడుగురు పిల్లలలున్న కుటుంబం ఆధారంలేని స్థితిలోకి వెళ్లిపోయిందని, ఘటనపై ఇటుకబట్టీ యజమాని స్పందించికపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు కొద్దిసేపు పోలీస్‌స్టేషన్ ప్రాంగంణంలో ఆందోళనకు దిగారు. సీఐ సతీష్ వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు మో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ము గ్గురు కుమార్తెలు, నలుగురు కొడుకులు ఉన్నా రు. ప్రమాదానికి కారణమైన క్రేన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.