బంజారాహిల్స్ : అదుపుతప్పిన వేగంతో దూసుకువచ్చిన ఓ కారు డీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని వాక్స్ బేకరి సమీపంలో రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను అతివేగంతో వచ్చిన కారు డీకొట్టింది.
దాంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో గాయపడిన మహిళను ఆస్పత్రికితరలించారు. సంఘటనా సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులున్నట్లు స్థానికులు తెలిపారు.