హైదరాబాద్: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్లో పుష్పా 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్నది. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో (Pushpa 2 Stampede) ఓ మహిళ మృతిచెందారు. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి పుష్పా 2 బెనిఫిట్ షోను చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వచ్చారు. పుష్పరాజ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ దవాఖాన తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్హాస్పిటల్కు తరలించారు.
పుష్ప-2 బెనిఫిట్ షోను చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు వచ్చారు. వారిలో తల్లి, కుమారుడు తొక్కిసలాటలో కిందపడి గాయాలు కాగా, తల్లి మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియోలో ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తడం కనిపిస్తుంది. ఈ ఘటనలో బాలుడు శ్రీతేజ్ స్పృహ తప్పిపడిపోవడం కనిపిస్తుంది. పోలీసు అధికారులు బాలుడిని తీసుకొచ్చి, CPR చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలుడి ఛాతిపై చేతులతో సీపీఆర్ చేసి, బాలుడి చేతులు, కాళ్ళను రుద్దడం వంటివి చేశారు.
A boy lost consciousness in a #stampede at the premiere show of #Pupshpa2 at RTC Cross Road #SandhyaTheater.. His condition is critical.#Hyderabad #Telangana pic.twitter.com/oN3Wn7vOSh
— BNN Channel (@Bavazir_network) December 4, 2024