హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రీన్ సిటీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను కత్తులతో మాజీ కిరాతకంగా పొట్టనపెట్టుకున్నాడు. వనస్థిలిపురంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వివాహితను మహేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను పెట్రోల్ పోసి అంటిస్తానని బెదిరించాడు.
సదరు మహిళతో తనకు గతంలో పెళ్లి అయిందని, తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.