Fire accident | అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వెదురు మండపం
Fire accident | అయోధ్య (Ayodhya) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమి (Sri Ram Navami) సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది (Sarayu river) తీరంలోని జమ్తారా ఘాట్ వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
Fire accident : అయోధ్య (Ayodhya) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమి (Sri Ram Navami) సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది (Sarayu river) తీరంలోని జమ్తారా ఘాట్ వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. యజ్ఞం ముగిసిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక ఎకరం విస్తీర్ణంలో వెదురు, గడ్డితో నిర్మించిన మండపం క్షణాల్లో కాలి బూడిదయింది. కాగా ప్రమాద సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. యజ్ఞ గుండంలోని నిప్పురవ్వలు ఎగిసి పడటం వల్లనే మండపానికి మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యజ్ఞ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపిస్తున్నారు. కేవలం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భద్రతా ఏర్పాట్లను గాలికి ఒదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కార్యక్రమం వెనుక ఉన్న ఆర్థిక వనరులు, మానవ వనరుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
Ayodhya UP – A sudden and massive fire erupted today during the concluding day of the grand 1251-Kund Mahayagya being held at Rajghat in Ayodhya. pic.twitter.com/HSwCumbFNh
— NextMinute News (@nextminutenews7) March 28, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

