మూసాపేట, సెప్టెంబర్10: గేటెడ్ కమ్యూనిటీలో నివాసముండే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పప్పు కుక్కర్‌తో తలపై బాది.. కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రాకేశ్, రేణు అగర్వాల్(50) దంపతులు. స్వాన్లేక్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు సంతానం.
రాకేశ్ బాలానగర్‌లో స్టీల్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న రాకేశ్.. బంధువుల నివాసంలో జార్ఖండ్‌కు చెందిన రోషన్ కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి ద్వారా హర్షను 11 రోజుల కిందట రాకేశ్ ఇంట్లో పనికి కుదిర్చాడు. బుధవారం ఇంట్లో దొంగతనానికి పాల్పడుతుండగా రేణు అగర్వాల్ ప్రతిఘటించింది. దీంతో రేణు అగర్వాల్‌ను హర్ష, రోషన్ పప్పుకుక్కర్తో తలపై బాది, తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు.
అనంతరం తమకు అంటుకున్న రక్తపు మరకలను తుడుచుకొని అక్కడే స్నానం చేసి ఇంటి తలుపులకు తాళం వేసి నగలు, డబ్బుతో బైక్‌పై పరారయ్యారు. సాయంత్రం మృతురాలి భర్త ఇంటికి వచ్చి చూడగా, రేణు రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్, ఏసీపీ రవికిరణ్, కూకట్పల్లి సీఐ వెంకట సుబ్బరావు ఘటనస్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.