e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home జిల్లాలు Trs plenary | టీఆర్ఎస్ అభివృద్ధితో దేశం చూపు తెలంగాణ వైపు : మంత్రి కేటీఆర్‌

Trs plenary | టీఆర్ఎస్ అభివృద్ధితో దేశం చూపు తెలంగాణ వైపు : మంత్రి కేటీఆర్‌

మాదాపూర్ : టీఆర్‌ఎస్ పార్టీ సమర్థతను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్య దక్షతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీన జరగనున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో భాగంగా గురువారం మాదాపూర్‌లోని హైటెక్స్​​‍ ప్రాంగణంలో ఏర్పాట్లను పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు పరిశీలించారు.

కేటీఆర్‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, చెవెళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, కర్నె ప్రభాకర్‌, టీఎస్ఐఐసి చైర్మెన్‌ బాలమల్లు, పౌరసరఫరాల చైర్మెన్‌ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్‌ అరెకపూడి గాంధీ, శాసన సభ్యులు మాగంటి గోపినాథ్‌, మాదవరం కృష్ణారావు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జోనల్‌ కమీషనర్‌ రవికిరణ్‌, చందానగర్‌ సర్కిల్‌ ఉపకమీషనర్‌ సుదాంశ్‌ల‌తో పాటు సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, డిసిపి వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌ కుమార్‌లతో కలిసి పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … గత రెండున్నర సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ ముఖ్య మంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నో చిరస్మరణీయ పరిపాలన విధానాలు, సంస్కరణల రూపంలో వారు తీసుకు వచ్చిన విజయాలతో పాటు విధానాల రూపకల్పనలో దేశానికి దిశానిర్థేశం చేసిన విధానాన్ని ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహత్మకమైన ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పతకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ది, సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనంగా దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని చోట్ల తెలంగాణ అమలు చేస్తున్నటువంటి విధానాలను ఇతరులు అనుసరించడం గర్వించదగ్గ విషయమన్నారు. పక్క రాష్ట్రమైన మహరాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతానికి సంబంధించిన ఆయా గ్రామాల సర్పంచులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో కలుస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినట్లు తెలిపారు. బీజేపి బాగస్వామిగా ఉన్నటువంటి కర్నాటకలోని రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో కలిపితే బాగుంటుందని, కర్నాటకాలో జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క తెలంగాణలో మాత్రమే అమలవుతున్నట్లు ఆ రాష్ట్ర శాసనసభ్యులు వాపోయినట్లు తెలిపారు.

భారత ప్రభుత్వం సైతం తెలంగాణ నుండి స్పూర్తి పొందే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కార్యద‌క్ష‌త‌ నేడు రుజువయిందన్నారు. ముఖ్యంగా భారతదేశానికి భారత ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచిన అరుదైన పతకాల రూపకల్పన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమర్థతతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 2018 లో రైతు బంధు పతకాన్ని ప్రవేశపట్టడంతో భారత రైతాంగానికి సైతం ఆచరణాత్మకంగా మారిందని తెలియజేశారు. దీన్ని స్పూర్తిగా తీసుకొని రైతులకు లబ్ది చేకూరుతుందనే ఉద్ధేశ్యంతో భారత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో పీఎం కిసాన్‌ అనే పతకాన్ని అమలు చేసినట్లు తెలిపారు.

మిషన్‌ భగీరథ కార్యక్రమంతో రాష్ట్రంలో ఇంటింటికి నల్లా నీళ్ళను అందించిందని ఈ విధానాన్ని భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌, నార్నె శ్రీనివాస్, మాదాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్‌, జీహెచ్‌ఎంసి ఇంజనీర్‌ విభాగం ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, ఏఈ ప్రశాంత్‌లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement