Lakshdweep | 47 ఏండ్ల నిషేధం ఎత్తివేత.. లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్
Lakshdweep | ముస్లింలు అధికంగా నివసించే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఆల్కహాల్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా గత 47 ఏండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసింది.
Lakshdweep | ముస్లింలు అధికంగా నివసించే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఆల్కహాల్ అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా గత 47 ఏండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు 1979లో అమల్లోకి వచ్చిన ‘లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్‘ను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నియంత్రిత విధానంలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు మార్గం సుగమమైంది.
కొత్తగా అమల్లోకి వచ్చిన లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026 ప్రకారం మద్యం తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, కొనుగోలు, విక్రయాలు, వినియోగం వంటి అంశాలు అన్నింటినీ లైసెన్సింగ్ వ్యవస్ధ ద్వారా నియంత్రించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు కూడా మద్యం దిగుమతి, రిటైల్ విక్రయాలకు అనుమతి పొందే వెసులుబాటు కల్పించింది.
భారీగా పన్నులు
అయితే మద్యం అందుబాటులోకి తెస్తున్నప్పటికీ అధిక పన్నులు విధించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL), విదేశీ మద్యంపై 400 శాతం, బీర్లపై 200 శాతం, వైన్‌పై 80 శాతం వరకు ఎక్సైజ్ సుంకం విధించారు. అలాగే 21 ఏండ్లలోపు వారికి మద్యం విక్రయించడంపై నిషేధం ఉంచారు. అవసరమైతే లక్షద్వీప్‌లోని ఏదైనా ప్రాంతంలో మళ్లీ నిషేధం విధించే అధికారం అడ్మినిస్ట్రేటర్‌కు ఉంటుంది.
లక్షద్వీప్‌లో మద్యంపై నిషేధం ఎందుకు?
లక్షద్వీప్‌లో సుమారు 97 శాతం జనాభా ముస్లింలే. భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంతో పోల్చినా ఇది చాలా అధికం. ఇస్లాం మతంలో మద్యపానాన్ని నిషేధించిన నేపథ్యంలో 1979 నుంచి లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేశారు. అయితే ఈ నిషేధం పూర్తిస్థాయిలో లేదు. పర్యాటకులు, ప్రభుత్వ అధికారుల కోసం కొన్ని మినహాయింపులు ఉండేవి. కానీ లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేసింది. మాల్దీవులు వంటి సముద్ర ద్వీప పర్యాటక కేంద్రాలతో పోటీ పడాలంటే నిషేధం అడ్డంకిగా మారుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

