కీసర, మార్చి 17 : మండల పరిధిలోని గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్‌లో పంచాయతీ నిధులు రూ.4లక్షలతో 4వ వార్డులో , ఎస్ఎల్ఎన్ఎస్ హోమ్స్‌లో రూ.4లక్షలు, మరికొన్ని కాలనీల్లో రూ.4లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, అలాగే 8,9వ వార్డులో రూ.6లక్షలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎంపీపీ, సర్పంచ్ తుంగ ధర్మేందర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుమలరెడ్డి, పంచాయతీ సభ్యులు ఎం.రాజు, కె. మహంకాళి, ఎస్.గౌరీశంకర్, బి.ఆంజనేయులు, డి. శాలిని, ఆర్.రాంరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు కె.మల్లేశ్‌లతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.