Vantara | సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా గుజరాత్‌లోని వాంతార పనిచేస్తుందని సీఈవో వివాన్ కరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గ్రీన్స్ జువాలజికల్ రెస్కూ, రీహాబిటేషన్ సెంటర్‌గా దాదాపు 2వేల వన్యప్రాణులను సంరక్షిస్తున్నట్లుగా వివరించారు.
రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఎలిఫెంట్ క్యాంప్ ద్వారా 3500 ఎకరాల్లో దాదాపు 2వేల మంది ఉద్యోగులు కలిసి ఏనుగులకు సేవలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో కరువు కాటకాల్లో చిక్కుకున్న నమీబియా అటవీ ప్రాణాలను సంరక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు.