మైలార్దేవ్ల్లి, ఫిబ్రవరి 22: కట్టుకున్న భర్త, అత్తింటివారు వేధిస్తున్నాడని ఓ భార్య ఆందోళనకు దిగింది. అత్తగారింటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీగూడకు చెందిన శివకు లహరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలం పాటు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదే అదనుగా అత్త కూడా వేధించడం ప్రారంభించారు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవారు. శివ తాగొచ్చి లహరితో గొడవపడి.. చితకబాదాడు. ఈ క్రమంలోనే భర్త వేధింపులపై ఆరు నెలల క్రితం లహరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తనపై ఫిర్యాదు చేసిందనే కోపంతో లహరిని ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశాడు.
Lahari1
లహరి తల్లి వచ్చి ఎంత సర్దిచెబుదామని చూసినా శివ, అతని తల్లి వినిపించుకోలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుటుంబసభ్యులతో అత్తగారింటికి లహరి వచ్చింది. కానీ లహరిని ఇంట్లోకి అనుమతించలేదు. ఈ క్రమంలో అత్తగారింటి ముందే లహరి, ఆమె కుటుంబసభ్యులు బైఠాయించారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇలాగే ధర్నా చేస్తానని తెలిపింది. ఇదిలా ఉంటే.. భర్తపై లహరి మరసారి మైలార్దేవ్పల్లి పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేసింది.