MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
MLC Dasoju Shravan Kumar | ఈ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఎల్‌నినో పరిస్థితులు భయంకరంగా ఉంటే దాన్ని పటించుకోకుండా మూసీ ప్రక్షాళన పేరిట సీఎం రేవంత్ రెడ్డి లూటీ చేస్తున్నారన్నారు.
MLC Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి పిరికిపందలా వ్యవహరిస్తున్నారని..పబ్లిక్ హియరింగ్ ప్రైవేట్ హియరింగ్గా మారిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు.. పబ్లిక్ హియరింగ్‌కు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు.. మూసీ మా సుధీర్ రెడ్డి నియోజకవర్గం నుంచి పారుతుంది. ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు.
ఈ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ చట్ట విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు తెలిపారు. 7300 కోట్ల రూపాయల ఆసియా అభివృద్ధి బ్యాంకు ఋణంతో మూసీకి టెండర్లు పిలిచారు.. ఎల్‌నినో పరిస్థితులు భయంకరంగా ఉంటే దాన్ని పటించుకోకుండా మూసీ ప్రక్షాళన పేరిట లూటీ చేస్తున్నారు. ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. ఇంకోడు చుట్ట కాల్చుకోవడానికి అగ్గి కోసం వెతికినట్టు ఉంది రేవంత్ తీరు అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టమంటే పెదవులకు లిప్‌స్టిక్ పూసినట్టు ఉంది.. ఇదే సౌదీలో అయితే రేవంత్ ఆయన మంత్రులను రాళ్లతో కొట్టి శిక్షించే వాళ్లన్నారు.
మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాక్కోవడం సబబా.. ?
ఆంధ్రకు నీళ్లు వదిలి చోద్యం చూశారు.. కరువును పట్టించుకోకుండా మూసీకి రంగులు వేస్తున్నాడు పెయింటర్ బాబు అని ఎమ్మెల్సీ దాసోజు ఎద్దేవా చేశారు. రూ.7300 కోట్ల టెండర్లలో 30 శాతం కమిషన్ దొబ్బాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.. ఆర్ఆర్ ట్యాక్స్ అని మోదీ ఇది వరకే చెప్పాడు ఆదానీ, మేఘా లాంటి సంస్థలకు మూసీ టెండర్లు దక్కేలా రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. కరువులో కూడా రేవంత్ ఇంత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాక్కోవడం సబబా.. ?..డీ పీ ఆర్ లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరగడం రేవంత్ సొంత ఇంటి వ్యవహారమా.. ? తాగడానికి నీళ్లు లేవు కానీ మూసీలో మల్లన్న సాగర్ నీళ్లు తెచ్చి పోస్తాడట. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు గురించి ఎవరికీ తెలియదు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు అమరావతి నుంచి వచ్చింది. అమరావతికి గ్రాఫిక్స్ తయారు చేసిన మెయిన్ హార్ట్ సంస్థ కే మూవీసీ డిజైన్లు అప్పగించారు.. అప్పనంగా రాష్ట్ర సంపద దోచి పెట్టడానికి రేవంత్ తాత జాగీరా.. అని ఫైర్ అయ్యారు.
వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆస్తులను కొల్లగొట్టేందుకు కూడా రేవంత్ స్కెచ్ వేశారని ఎమ్మెల్సీ దాసోజు పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా రేవంత్ దోపిడీని బీఆర్ఎస్ అడ్డుకుంటూనే ఉంటుంది. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు నష్టపోకుండా ఎంతటి పోరాటానికైనా సిద్దమన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇపుడు కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం https://t.co/dOEUvmmzOh
— BRS Party (@BRSparty) October 28, 2026
Read Also :
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

