ఖైరతాబాద్, డిసెంబర్ 2 : నిమ్స్ వైద్యుడు తాను పనిచేస్తున్న వైద్యశాలకు తనవంతు చేయూతనిచ్చారు. మైక్రోబయాలజీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంఎ పాటిల్ తన తండ్రి దివంగత అప్పారావు పాటిల్ జ్ఞాపకార్థం వీల్చైర్లను అందించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఆర్ఎంవో సల్మాన్ డాక్టర్ పాటిల్‌ను అభినందించారు.