హైదరాబాద్ : రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగుకోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆడ పిల్లల పెళ్లిళ్ల (Marriage) కు లక్ష రూపాయల నగదుతోపాటు తులం బంగారం(Gold) , ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రేషన్ కార్డులు( Ration Cards) ఇస్తామన్న కాంగ్రెస్ ఆరు నెలలవుతున్నా ఆ ఊసెత్తడం లేదని ఆరోపించారు. గత పదిహేనేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం అందించ లేకపోతున్నారని పేర్కొన్నారు.
రేషన్ కార్డులు లేక చాలా మంది మహిళలు పొదుపు సంఘాలలో చేరలేకపోతున్నారని, కొత్త గ్యాస్ కనెక్షన్ (Gas Connections) లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ (Real Estate) ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.