చర్లపల్లి, జనవరి 1 : చర్లపల్లి డివిజన్, చక్రీపురం కాలనీ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం చక్రీపురం కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధి లో పేదల సంక్షేమం కోసం బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా కాలనీ సంక్షేమ సంఘాలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు, పేదలను గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే నిధులను అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అం దించడంతో పాటు వారికి అభిరుచి ఉన్న రంగాల్లో ఉపాధి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మొగిలి రాఘవరెడ్డి, కట్కూరి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్, యాదవరెడ్డి, రమణ, హనుమంత్నాయక్తో పాటు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.