Nandanavanam Park | జవహర్‌నగర్, మార్చి 13: జవహర్‌నగర్‌లోని నందనవనం పార్కును కబ్జా చేయాలని చూడటం దుర్మార్గమని, కబ్జాదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంద్‌నగర్ కాలనీవాసులు అన్నారు. రూ. 35లక్షలతో పార్కును సుందరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దితే కాంగ్రెస్ ఖతం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. ప్రా ణాలను పణంగా పెట్టైనా.. కబ్జా కాకుండా పార్కును కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో పుష్పలత, ఐలమ్మ, లత, జయ, రత్నా తదితరులు పాల్గొన్నారు.