సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ధూపదీప నైవేద్య పథకంలో అర్చకుల సంఘానికి రాష్ట్ర నూత న అధ్యక్షుడిగా దౌలతాబాద్ వాసుదేవశర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వతపరిషత్ భవనంలో రాష్ట్రకార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు బస్వరాజు శ్రీనివాస్ మా ట్లాడుతూ రాష్ట్రంలో ధూపదీప నైవేద్య సం ఘం అర్చకులంతా ఏకతాటిపైకి రావడం చా లా ఆనందంగా ఉందని, ఆలయాలకు పునర్వైభవం తెచ్చేందుకు అర్చకులు చేస్తున్న కృ షిని అభినందించారు.
2007లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటివరకు సుమారు ఆరువేల దేవాలయాలకు వర్తింపచేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని దేవాలయాలకు ధూపదీపాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ, బ్రాహ్మణ పరిషత్ వైస్‌చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, టీజీవో అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాస్, డీడీఎన్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికీర్తి అమరేశ్వరశర్మ, కోశాధికారి నందనం హరికిషన్శర్మ, కన్వీనర్ గొడవర్తి చక్రధరాచార్యులు, మహిళా కన్వీనర్ విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.