నిర్బంధంలో జలమండలి
జలమండలి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
- ప్రధాన కార్యాలయంలోకి వినియోగదారులకు అనుమతి నిరాకరణ
- మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావాలంటూ నిబంధనలు
- సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తప్పని తిప్పలు
జలమండలి గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీతో సహా విస్తీర్ణం పెరిగి మహా జలమండలిగా విస్తరించింది. క్యూర్ వ్యాప్తంగా మొత్తం 2053 చదరపు కిలోమీటర్ల వరకు జలమండలి పరిధి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి నిత్యం వందలాది మంది వినియోగదారులు వస్తుంటారు. ఏదైనా సమస్య పరిష్కరించుకోవడానికి లేదంటే ఉన్నతాధికారులను కలవాలంటే శివారు ప్రాంతాల వాళ్లకు కనీసం రెండు గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఆయా ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరితే ప్రధాన కార్యాలయానికి చేరుకునేందుకు మధ్యాహ్నం అవుతుంది. తాజాగా, జలమండలి అధికారులను కలిసేందుకు సందర్శకులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : జలమండలి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమస్యలను చెప్పుకొనేందుకు మూడు గంటల కంటే ముందు వచ్చిన వారు ప్రాంగణం బయటనే గంటల తరబడిగా వేచి ఉండాల్సి వస్తున్నది. నల్లా బిల్లులు, సీవరేజి సమస్యలు, సుదీర్ఘంగా ఉన్న తాగునీటి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకోవాలని వస్తే.. 3 గంటల వరకు లోపలికి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాత కార్యాలయానికి వస్తే అధికారులతో మాట్లాడి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల భాగస్వామ్యం ప్రధానంగా ఉండే జలమండలి కార్యాలయ అధికారులను కలవడానికి నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి మున్సిపాలిటీలను 2021లో అప్పటి ప్రభుత్వం జలమండలిలో విలీనం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ రింగ్‌రోడ్డు బయట ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తున్న మరికొన్ని మున్సిపాలిటీలను జలమండలిలో కలిపేసి.. మహా జలమండలిగా విస్తరించింది.
జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్ల విలీన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, మురుగు నిర్వహణ సమస్యలతో సతమతమవుతున్నారు. క్షేత్రస్థాయి అధకారులు సైతం చేతులెత్తేసి ఉన్నతాధికారులను అడగాలని సెలవిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి కేంద్ర కార్యాలయానికి వస్తే మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావాలని.. అప్పటిదాకా లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడిగా వేచి ఉండాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమ సమస్యలను చెప్పుకుందామంటే 3-5 వరకే రావాలంటుడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు కేవలం రెం డు గంటలే కేటాయించడంప విమర్శలు వస్తున్నాయి. ఎమర్జెన్సీ విభాగంగా పేరున్న జలమండలి అధికారులను కలిసేందుకు 2 గంటలే ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కొత్త నిబంధనను తొలగించి అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

