చాంద్రాయణ గుట్ట జూన్ 30: అనుమానాస్పద స్థితిలో ఓ కార్పొరేటర్ దగ్గర పని చేసే వాచ్మెన్ దారుణ హత్యకు గురైన సంఘటన బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్పురా కార్పొరేటర్ హుస్సేన్ పాషా వద్ద ఇస్మాయిల్ (34) వాచ్మెన్గా పని చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి బయటకు వెళ్లిన అతను బహదూర్పురా ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఫలక్నుమా ఏసీపీ జావీద్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెయాల్సి ఉంది.