అంబర్ పేట, జూలై 14: విద్యానగర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ దవాఖానలో వైద్యం కోసం చేరిన రోగి భార్య (సహాయకురా)తో అక్కడ పనిచేసే వార్డ్బాయ్ అసభ్యంగా ప్రవర్తించడంగా.. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఇతర రోగుల సహాయకులు ఆ ప్రబుద్ధుడిని చితకబాది నల్లకుంట పోలీసులకు అప్పగించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు.. నగరానికి చెందిన శివలక్ష్మణ్ గత శుక్రవారం హైబీపీతో బాధపడుతూ విద్యానగర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చేరాడు.
చికిత్స అనంతరం శివలక్ష్మణ్ను ఆదివారం ఆస్పత్రిలోని జనరల్ వార్డ్ షేరింగ్ రూంలోకి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో శివ లక్ష్మణ్‌కు సహాయకురాలిగా ఆయన భార్య అక్కడే ఆస్పత్రిలో ఉంటోంది. సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జనరల్ వార్డులో నైట్ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న రాంనగర్‌కు చెందిన వార్డు బాయ్ సీతారాం (22)..
రోగి శివలక్ష్మణ్ బెడ్‌పై నిద్రపోతున్న విషయాన్ని గమనించి అతను షేరింగ్ రూం తలుపునకు గడియ పెట్టి అతనికి సహాయకురాలిగా ఉన్న అతడి భార్యతో అసభ్యకరంగా ప్రవరించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు పెట్టగా ఆస్పత్రిలో ఉన్న తోటి పేషెంట్ల సహాయకులు సీతారాంను పట్టుకొని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.