మేడ్చల్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మేడ్చల్ మండలం బండమాదారానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గల్లంతు అవుతాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు సత్యనారాయణ, పాండు, ఈశ్వర్, మాజీ వార్డు సభ్యులు వెంకటేశ్, నాగులు, సైలయ్యతో పాటు మరో 20 మంది బీఆర్ఎస్లో చేరగా, వారికి మంత్రి మల్లారెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దయానంద్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.