ఖైరతాబాద్, జూన్ 18 : ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం నెక్లెస్‌రోడ్‌లో ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వాక్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. యోగాతో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్య సమతుల్యత ఏర్పడుతుందన్నారు. 21న యోగా దినోత్సవాన్ని ప్రతి పాఠశాల, కళాశాలల్లో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆయూష్ విభాగం కమిషనర్ ప్రశాంతి, డైరెక్టర్ పాణికిరణ్, ప్రకృతి, హోమియో వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు.