వాకింగ్‌కు వెళ్లి..శవమై ఇంటికి..

- యువకుడి ప్రాణం తీసిన ప్రహరీ
- ఎస్ఆర్నగర్లో ఘటన
వెంగళరావునగర్, జూలై 8: వాకింగ్ కోసం వెళ్లిన ఓ యువకుడిపై గోడ కూలి మీద పడటంతో దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. కల్యాణ్‌నగర్ ఫేజ్-3లో ప్రభాదిత్య ప్యాలెస్ అపార్ట్మెంట్లో నినసించే గంగాధర్‌రావు, సునీత దంపతుల కుమారడు ఎన్. ఆశిష్(25) ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. బుధవారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆశిష్ తల్లి సునీత, సోదరి ఆశి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, భారీ వర్షానికి రాజీవ్‌నగర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ గోడ కూలడంతో గురువారం బల్దియా సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, ఆశిష్ మృతదేహం బయటపడింది. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆశిష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. వాకింగ్ చేస్తూ.. గోడ పక్క నుంచి వెళ్తుండగా, అది కూలడంతో ఆశిష్ శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడి ప్రాణాలు కోల్పోయాడు. గోడ పడిపోయిన ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలై.. అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- death case
- wall collapse
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

